కింగ్ తో మరోసారి..!
- January 07, 2017
సెకండ్ ఇన్నింగ్స్ లో జెట్ స్పీడుతో దూసుకుపోతోంది చెన్నై చంద్రం త్రిష. పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోవటంతో తిరిగి సినిమాల మీద దృష్టి పెట్టిన ఈ బ్యూటి ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు గ్లామర్ రోల్స్ లోనూ అలరిస్తోంది. ఎక్కువగా కోలీవుడ్ సినిమాలు మాత్రమే చేస్తున్న త్రిష, త్వరలో ఓ సీనియర్ స్టార్ హీరో సరసన తెలుగు సినిమా చేసేందుకు అంగీకరించింది.
ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడూ ముందుండే సీనియర్ స్టార్ నాగార్జున హీరోగా తెరకెక్కనున్న సినిమా రాజుగారి గది 2. ఓంకార్ దర్శకత్వంలో పీవీపీ సినిమాస్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగ్ కు జోడిగా త్రిష అలరించనుంది. గతంలో కింగ్ సినిమాలో కలిసి నటించిన ఈ జోడి మరోసారి తెర ఆకట్టుకునేందుకు రెడీ అవుతున్నారు.
ఈ సినిమాలో సీరత్ కపూర్ మరో హీరోయిన్ గా నటిస్తుండగా.. సమంత కీలక పాత్రలో కనిపించనుందన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే హీరోయిన్ల ఎంపికపై చిత్రయూనిట్ క్లారిటీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







