శ్రీలంక పర్యటనలో చంద్రబాబు..
- January 07, 2017
చంద్రబాబు శ్రీలంకలో పర్యటిస్తున్నారు.. శ్రీలంక ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన కొలంబో వెళ్లారు. ఇవాళ జరగనున్న ప్రపంచ పేదరిక నిర్మూలన సదస్సులో ఏపీ ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేయనున్నారు. జన్మభూమి-మాఊరు కార్యక్రమాలతో ప్రజల మధ్య బిజీగా ఉన్న ముఖ్యమంత్రి ప్రస్తుతం పొరుగు దేశం శ్రీలంక వెళ్లారు. అక్కడ చంద్రబాబు బృందానికి ఘన స్వాగతం లభించింది. శ్రీలంక పశ్చిమ ప్రావిన్స్ గవర్నర్, మంత్రి సుదర్శిని ఫెర్నాండో పులే, అక్కడి అధ్యక్ష కార్యాలయ ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలికారు. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనతో శనివారం రాత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. అనంతరం.. సిరిసేన బర్త్‌డే సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో సీఎం టీమ్ పాల్గొంది. శ్రీలంక ప్రభుత్వ ప్రత్యేక ఆహ్వానం మేరకు కొలంబో వెళ్లిన చంద్రబాబు.. ఇవాళ జరిగే ప్రపంచ పేదరిక నిర్మూలన సదస్సులో పాల్గొంటారు. పేదరికం అంతానికి సమరం ఎలా సాగించాలనే అంశంపై ఏపీ ముఖ్యమంత్రి తన విజన్‌ను సదస్సులో ఆవిష్కరించనున్నారు.
తాజా వార్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్
- రిపబ్లిక్ డే 2026: పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం..
- JEOగా డాక్టర్ ఏ.శరత్ బాధ్యతలు స్వీకరణ
- టీవీకే పార్టీ ఎన్నికల గుర్తు ‘విజిల్’ను ఆవిష్కరించిన విజయ్
- హైదరాబాద్ లో డ్రగ్స్ కలకలం.. కాలేజీ విద్యార్థులు అరెస్ట్
- తైవాన్‌లోని అత్యంత ఎత్తైన భవనాన్ని అధిరోహించిన అమెరికన్ సాహసవీరుడు..!!
- సౌదీ పోర్టుల్లో 965 ప్రొహిబిటేడ్ ఐటమ్స్ సీజ్..!!
- దుబాయ్‌లో ఆస్తి కొనుగోలు చేస్తున్నారా?
- కువైట్ లోని లులు హైపర్ మార్కెట్లో ఇండియా ఉత్సవ్ వేడుకలు..!!







