'టిప్పు సుల్తాన్' గా సూపర్ స్టార్ రజని
- September 11, 2015
సూపర్ స్టార్ రజినీ కాంత్ మరో చారిత్రాత్మక చిత్రంలో నటించనున్నారా..? వెండి తెరపై సుల్తాన్ గా మెరవనున్నారా అంటే అవుననే వినిపిస్తోంది. మైసూర్ టైగర్‌గా యావత్ ప్రపంచంలో తనకంటూ ఓ చరిత్ర సృష్టించుకున్న భారతీయ రారాజు టిప్పు సుల్తాన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందే భారీ బడ్జెట్ చిత్రంలో రజనీకాంత్ నటిస్తున్నట్టు సమాచారం. బెంగుళూరుకి చెందిన ప్రముఖ కన్నడ నిర్మాత అశోక్ కీనే ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఓ కన్నడ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత అశోక్కీన్ ఈ విషయాన్ని తెలియజేశారు. ''టిప్పు సుల్తాన్, హాలీవుడ్లో రూపొందిన మరో బయోపిక్ 'గాంధీ' చిత్రాలను చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. అయితే 'టిప్పుసుల్తాన్' చిత్రంలో రజనీకాంత్ నటించేందుకు సుముఖంగా ఉన్నారు. భారతీయ భాషల్లో రూపొందిన చిత్రాలతో పోలిస్తే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాను. ఈ ప్రాజెక్ట్ విషయమై ఇప్పటికే రజనీకాంత్‌తో పలుమార్లు కలవడం జరిగింది. అలాగే జాతిపిత గాంధీజీ జీవితం ఆధారంగా హాలీవుడ్లోనిర్మితమైన చిత్రాన్ని ఓ ప్రముఖ నటుడితో భారతీయ భాషలన్నింటిలోనూ రీమేక్ చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నాను'' అని నిర్మాత అశోక్కెన్నీ చెప్పారు. అయితే ఈ వార్త రావడంతో టిప్పు సుల్తాన్ గెటప్ లో డిజైన్ చేసిన రజినీ ఫొటోలను ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టు చేసి హల్ చల్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







