ఖతార్ ఓపెన్ ఫైనల్లో ఆండీ ముర్రేను ఓడించిన జకోవిచ్
- January 08, 2017
సెర్బియన్ టెన్నిస్ స్టార్ జకోవిచ్ ఖతార్ ఓపెన్ ఫైనల్లో ప్రపంచ నెం.1 ఆండీ ముర్రేను ఓడించాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ జకోవిచ్ 6-3, 5-7, 6-4 తేడాతో ముర్రేను ఓడించి టైటిల్‌ను నిలబెట్టుకున్నాడు. మూడు గంటలపాటు హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో గెలుపుతో ముర్రే వరుస విజయాలకు జకోవిచ్ బ్రేక్ వేశాడు. మ్యాచ్‌లో మొదటి సెట్‌ను జకోవిచ్ దక్కించుకున్నప్పటికీ రెండో సెట్లో ముర్రే పుంజుకొని ఆడాడు. నిర్ణయాత్మక మూడో సెట్లో జకో తన ఆదిపత్యాన్ని ప్రదర్శించాడు. ముర్రేతో తలపడిన మ్యాచ్‌లో మొదటి సెట్‌ను దక్కించుకొని విజయం సాధించడం జకోవిచ్‌కు ఇది 20వ సారి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







