'దేవుడా మగాళ్ల నుంచి నువ్వే కాపాడాలి' అంటున్న సౌదీ మహిళలు
- January 09, 2017
సౌదీ అరేబియా: పురుషాధిక్యంపై తమ ఆందోళన తెలుపుతూ ముగ్గురు మహిళలు విడుదల చేసిన వీడియో సౌదీ అరేబియాలో ప్రకంపనలు పుట్టిస్తోంది. అక్కడి నుంచి అమెరికా వరకు పాకి సెగలు రేపుతోంది. ఈ వీడియోలో సౌదీ మహిళలు ''దేవుడా మగాళ్ల నుంచి నువ్వే కాపాడాలి'' అని వేడుకున్నారు. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైనా విరుచుకుపడ్డారు. సౌదీ అరేబియాలో మహిళల హక్కులను హరిస్తూ అనేక అవకాశాల్లో పాల్గొనకుండా చేస్తున్నారని తూర్పూరబట్టారు. ఏదేమైనప్పటికీ వీడియో ఆసాంతం తమ సంప్రదాయ దుస్తుల్లోనే కనిపించారు. మరోవైపు తమ ఆకాంక్షలను తెలిపేందుకు ముగ్గురూ మోకాళ్ల కిందుగా రంగు రంగుల దుస్తులు, షూ ధరించారు. బాస్కెట్ బాల్ ఆడుతూ, స్కేట్ బోర్డుపై రయ్..మని దూసుకెళ్లారు.
బంపర్ కార్లు డ్రైవ్ చేస్తూ... డ్రైవింగ్ పట్ల తమకు గల మక్కువను తెలిపారు. అక్కడ మహిళలు డ్రైవింగ్ చూసేందుకు అనుమతి లేనందున చిన్నపిల్లాడితో కారు స్టార్ట్ చేయించడంతో వీడియో ప్రారంభమవుతుంది. కారు నుంచి ఒక్కసారి బయటికి వచ్చిన తర్వాత మొదలవుతుంది తిట్ల దండకం. ''మగాళ్లు నాశనమైపోవుదురు గాక... మా మానసిక రోగాలకు వారే కారణం'' అని సాగుతుంది. కాగా అచ్చం గతంలో ఇలాంటి జానపద గేయమే ఒకటి ఉండేదనీ.. దాన్ని ఆధారం చేసుకునే ఈ పాటను రూపొందించి ఉంటారని వాషింగ్టన్ పోస్టు ఉటంకించింది.
అయితే కొత్తగా వచ్చిన పాటలో వివిధ రాజకీయ విమర్శలు కూడా ఉన్నాయి. ''పురుషుల కొంప'' (హౌస్ ఆఫ్ మెన్) అంటూ ట్రంప్ కటౌట్ సైతం ప్రదర్శించారు. హిల్లరీ క్లింటన్ ఫోటోని కొట్టేసినట్టు చూపెడుతూ... పక్కన మీసాలు చూపించి పురుషుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోన్న ఈ వీడియో మీరూ చూడండి.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







