సినాయ్ లో ఉగ్రవాదుల ట్రక్ దాడి, 9 మంది పోలీసులు మృతి
- January 09, 2017
ఈజిప్టు సెక్యూరిటీ చెక్‌పాయింట్ వద్ద ఐసిస్ అనుమానిత ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారు. ఉత్తర సినాయ్ గవర్నరేట్‌లో చెత్త సేకరించే ట్రక్కులో పేలుడు పదార్థాలు ఉంచి దానితో సెక్యూరిటీ చెక్‌పాయింట్‌ను ఢీకొట్టారు. ఈ ఘటనలో కనీసం 9 మంది పోలీసులు మృతి చెందగా మరో 14 మంది తీవ్రంగా గాయపడినట్టు అధికారులు తెలిపారు. చెక్‌పాయింట్‌లోకి ట్రక్కుతో దూసుకుపోతూ ఉగ్రవాదులు కాల్పులు కూడా జరిపినట్టు పేర్కొన్నారు. అయితే ఏ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. గాయపడిన 14 మందిలో నలుగురు పౌరులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు. 2011 నుంచి ఇక్కడ ఉగ్రవాదులు తరచూ దాడులకు పాల్పడతున్నారు. తాజా దాడిలో 9 మంది పోలీసులు చనిపోయినట్టు చెబుతున్న కచ్చితమైన సంఖ్యను పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!







