ఫ్లైట్ లో పాము, సర్వీస్ రద్దు.!
- January 09, 2017
విమానాల్లో పాములు కనిపించడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. 2016 నవంబర్లో ఏరోమెక్సికో విమానం ప్రయాణిస్తుండగా పైనున్న లగేజీ కంపార్ట్మెంట్ నుంచి ఆకుపచ్చ పాము ఒకటి వేలాడుతూ కలకలం సృష్టించింది. వవిమానం ల్యాండయ్యే వరకు సిబ్బంది దానిని దుప్పట్లలో బంధించి ఉంచి జాగ్రత్తపడ్డారు. విమానం ల్యాండవగానే ప్రయాణికుల్ని మరో ద్వారం గుండా దించి యానిమల్ కంట్రోల్ బృందాన్ని పిలిపించి పామును తొలగించారు. తాజాగా ఎమిరేట్స్ సంస్థకు చెందిన విమానంలో ఆదివారం పాము కనిపించడంతో ప్రయాణీకులు జడుసుకున్నారు. దీంతో ప్రయాణానికి సిద్ధంగా ఉన్న ఆ విమానం రద్దు అయ్యింది. వివరాల్లోకి వెళితే.. ఎమిరేట్స్ సంస్థకి చెందిన ఈకే0863 విమానం ఆదివారం మస్కట్ నుంచి దుబాయ్ వెళ్లాల్సి ఉంది. ప్రయాణికులు విమానం ఎక్కుతున్న సమయంలో కార్గో లోపల ఉన్న పామును సిబ్బంది గమనించి.. కిందకు తోసేశారు. ప్రయాణీకులను కూడా కిందికి దించేశారు. విమానం నుంచి పామును తొలగించారు కానీ ఈ గందరగోళం కారణంగా ఆ విమాన సర్వీసును రద్దు చేసేశారు. జరిగిన పొరపాటుకి ఎమిరేట్స్ అధికారులు ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







