ఆంధ్ర - సింగపూర్‌ మధ్య కీలక ఒప్పందం

- January 09, 2017 , by Maagulf
ఆంధ్ర - సింగపూర్‌ మధ్య కీలక ఒప్పందం

నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. క్యాపిటల్‌ కన్‌స్ట్రక్షన్‌ను ఏపి సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఏపి ప్రభుత్వం మరో ముందడగు వేస్తూ సింగపూర్‌ సంస్ధలతో కీలక ఒప్పందం చేసుకుంది.  గుజరాత్ తర్వాత ఈ తరహా ఒప్పందాన్ని చేసుకున్న ఘనత ఏపిదే. అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది. సాంకేతిక అంశాలపై సింగపూర్ ప్రభుత్వంతో ఏపి సర్కార్‌ కీలక ఒప్పందం కుదుర్చుకుంది.పురపాలక శాఖా మంత్రి నారాయణ సమక్షంలో సీఆర్‌డీఏ, సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు సంతకాలు చేశారు.

అమరావతి నిర్మాణంలో టెక్నాలజీ సహాయంతో మౌలిక వసతులు, ఇతర సదుపాయాల కల్పనలు కల్పించటమే ఈ కీలక ఒప్పందం లక్ష్యం. అర్బన్‌ డవలప్‌మెంట్‌, అమరావతి స్మార్ట్‌ సిటీ రూపకల్పనలో టెక్నాలజీ ప్రముఖ పాత్ర వహించనుంది. అమరావతి నగరంలో అండర్‌గ్రౌండ్ కేబులింగ్‌,డ్రైనేజీలకు సంబంధించి మెరుగైన సాంకేతిక వ్యవస్ధ ఏర్పడేందుకు ఈ MOU ఉపయోగపడుతుందని మంత్రి నారాయణ తెలిపారు. కేవలం సాంకేతికత మాత్రమే కాదు ఆర్ధికంగా కూడా తోడ్పాడు అందించేందుకు సింగపూర్‌ సుముఖత వ్యక్తం చేసింది. ఇక నెల 26నాటికి అసెంబ్లీ నిర్మాణ పనులు పూర్తవుతాయని నారాయణ తెలిపారు. సమావేశాల నిర్వహణ తేదీలు త్వరలో ప్రకటిస్తామన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com