ఎదురుదెబ్బ అజారుద్దీన్ కు...
- January 13, 2017
హైదరాబాద్ : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజహరుద్దీన్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) అధ్యక్ష పదవికి ఆయన వేసిన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. కాగా మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో అజహర్‌పై బీసీసీఐ 2000 సంవత్సరంలో జీవితకాలం నిషేధం విధించగా, దాదాపు 12 ఏళ్ల తర్వాత ఏపీ హైకోర్టు బోర్డు నిర్ణయాన్ని తప్పు పడుతూ అజహర్‌ను నిర్దోషిగా తేల్చింది.
అయితే ఆ తర్వాత కూడా బీసీసీఐ అధికారికంగా అజహర్‌పై నిషేధాన్ని ఎత్తివేయలేదు. అయితే జీవిత కాల నిషేధంపై అజహర్ ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో ఆయన నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించినట్లు సమాచారం.
దీంతో హెచ్ సీఏ అధ్యక్ష పదవి రేసులో తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వివేక్, జయసింహ రేసులో ఉన్నారు. మరోవైపు నామినేషన్ తిరస్కరణపై అజారుద్దీన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం హెచ్‌సీఏ ఎన్నికలు ఈ నెల 17న జరగనున్నాయి.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







