ఆడవారిని సెక్స్ బానిసలుగా మారుస్తున్న పాక్
- January 15, 2017
పస్తూన్ యాక్టివిస్ట్ ఉమర్ దౌద్ ఖట్టక్ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. వందలాది మంది పస్తూన్ యువతులను సెక్స్ బానిసలుగా మారుస్తున్నారని ఆరోపించారు. తీవ్రవాద క్యాంపుల ప్రాంతాల్లో ఫండింగ్ చేసేందుకు యువతులను సెక్స్ బానిసలుగా మారుస్తున్నారన్నారు. ఉమర్ దౌద్ ఖట్టక్..ఆప్ఘనిస్తాన్‌కు చెందిన పస్తూన్ నాయకుడు. పస్తూన్ వేర్పాటువాద నాయకుడు. పాకిస్తాన్ సైన్యం స్వాత్, వజీరిస్తాన్ ప్రాంతాలలో ఎన్నో ఇళ్లను నాశనం చేస్తోందని, వందలాది మంది యువతులను కిడ్నాప్ చేసి.. లాహోర్‌లో సెక్స్ బానిసలుగా మారుస్తోందని ఆరోపించారు. పాకిస్థాన్ తమ ప్రాంతాల్లో మిలటరీ ఆపరేషన్లు చేపట్టి మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందన్నారు.
ముఖ్యంగా పస్తూన్ యువతులే లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని, వారిని అపహరించి అకృత్యాలకు పాల్పడుతున్నారన్నారు. తమ ప్రాంతాల్లో ఇళ్లను కూల్చివేశారని, వారి అకృత్యాలకు భరించలేక ఇప్పటికే అయిదు లక్షల మంది అఫ్గాన్‌కు తరలిపోయారని తెలిపారు. ఈ ఆగడాలన్నింటినీ అడ్డుకునేందుకు త్వరలో పస్తూనిస్తాన్ లిబరేషన్ ఆర్మీని నెలకొల్పనున్నామని, అందుకు ప్రపంచదేశాలు మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు. అంతముందు బెలూచిస్థాన్, గిల్గిట్ ప్రాంతాల్లో పాకిస్తాన్ అకృత్యాలను, ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో తమ సమస్యలను ప్రపంచానికి తెలియజెప్పినందుకు కొందరు బెలూచిస్తాన్ నాయకులు మోడీకి అప్పట్లో కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







