రిపబ్లిక్ డే కి రానున్న 'ఎస్ 3'
- January 15, 2017
'యముడు', 'సింగం2' చిత్రాలు ఎంతటి విజయం సాధించాయో తెలిసిందే. ఇప్పుడు ఆ చిత్రాల కొనసాగింపుగా 'ఎస్ 3' సిద్ధమైంది. 'యముడు3' అనేది ఉపశీర్షిక. తెలుగు, తమిళంలో ఏకకాలంలో నిర్మించారు. హరి దర్శకత్వం వహించారు. సూర్య కథానాయకుడు. అనుష్క, శ్రుతిహాసన నాయికలు. తమిళంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా, తెలుగులో సురక్ష్ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు. మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ''యముడు, సింగం-2 చిత్రాలు చక్కటి విజయాన్ని సాధించాయి. వాటికి కొనసాగింపుగా వస్తోన్న ఈ చిత్రం కూడా అంచనాలను అందుకుంటుంది. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కింది.
ఆద్యంతం ఆసక్తికరమైన మలుపులతో సాగుతుంది. నీతి నిజాయతీలే ఊపిరిగా భావించే ఓ పోలీస్ అధికారికి వృత్తి నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించాడన్నది కీలకం. సూర్య నటన, పాత్ర చిత్రణ హైలైట్‌గా నిలుస్తాయి. పాటలను నేరుగా మార్కెట్లోకి విడుదల చేశాం. త్వరలోనే ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తాం. ఈ నెల 26న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం'' అని చెప్పారు. రాధికా శరతకుమార్, నాజర్, రాడాన రవి, సుమిత్ర కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: హేరీస్ జైరాజ్.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







