హీరోగా రానున్న సుకుమార్ అన్న కొడుకు అశోక్
- January 16, 2017
ప్రముఖ సినీ దర్శకుడు బండ్రెడ్డి సుకుమార్ ఇంటి నుంచి ఆయన పెద్ద సోదరుడు బండ్రెడ్డి వెంకటేశ్వరరావు కుమారుడు అశోక్ తెలుగు తెరకు కొత్త హీరోగా పరిచయం కాబోతున్నారు. సుకుమార్ మరో సోదరుడు బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి నిర్మాతలుగా సుకుమార్ రైటింగ్స్ నుంచి బీటీఆర్ క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న 'దర్శకుడు' (హెర్ లవ్.. హిజ్ పేషన్.. అనే ఉపశీర్షికతో) సినిమాలో అశోక్ కథానాయకుడిగా నటిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను సుకుమార్, ఆయన సోదరుడైన నిర్మాత విజయ్‌కుమార్‌లు స్థానిక విలేకర్లకు వెల్లడించారు.
అశోక్ సరసన 'అంతకు ముందు.. ఆ తర్వాత' సినిమాలో హీరోయిన్గా నటించిన ఇషా కథానాయకగా నటిస్తోందన్నారు. తన వద్ద అసిస్టెంటు డైరెక్టరుగా పనిచేసిన హరిప్రసాద్ ఈ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారని సుకుమార్ చెప్పారు. సాయికార్తీక్ సంగీతాన్ని సమకూర్చారన్నారు. సినీరంగంలో ఉండే దర్శకుడు ప్రేమలో పడితే జరిగే పరిణామాల చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుందన్నారు. ఈ సినిమా చిత్రీకరణ మరో నాలుగైదు రోజుల్లో పూర్తి చేసుకొంటుందని, మార్చి నెలాఖరులోగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







