ముత్తూట్ ఫైనాన్స్ దొంగల అరెస్ట్
- January 16, 2017
సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురం ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసు నిందితులను పోలీసులు అరెస్టుచేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులు సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల నుంచి మూడున్నర కిలోల బంగారం, .5లక్షల నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీబీఐ అధికారులమంటూ డిసెంబర్ 28న రామచంద్రాపురంలోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలోకి చొరబడి సుమారు 40కిలోల బంగారం దోచుకెళ్లిన సంఘటన పెను సంచలనం సృష్టించింది. అయితే, తొమ్మిది మంది నిందితుల్లో పోలీసులు ఐదుగురిని అరెస్టుచేయగా, మరో నలుగురు నిందితుల కోసం ముమ్మరగాలింపు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. పట్టుబడిన నిందితులు కర్ణాటక, ముంబయి వాసులుగా గుర్తించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







