హార్వర్డ్ యూనివర్సిటీ 'ఇండియా కాన్ఫరెన్స్ 2017'లో పవన్ కళ్యాణ్
- January 16, 2017
ఎన్నడూ లేని విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసపెట్టి సినిమాలకు సైన్ చేస్తూనే , మరోవైపు రాజకీయాల్లోకి అడుగుపెట్టి జనసేన పేరుతో పార్టీ నెలకొల్పి ప్రజా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. నేరుగా ప్రజల్లోకి వెళ్లకపోయినా తన ప్రసంగాలతో , ప్రజలలో ఉత్తేజం నింపుతున్నాడు. తాజాగా అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ఒకటైన హార్వర్డ్ యూనివర్సిటీలో ఫిబ్రవరి నెలలో జరగనున్న 'ఇండియా కాన్ఫరెన్స్ 2017' ఈవెంట్‌లో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించిన సంస్థ నిర్వాహకులు ఆయన వస్తారన్న మాట ఇవ్వడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 10,11వ తేదీల్లో ఈ ఈవెంట్ జరగనుంది.
ఈ రెండు తేదీల్లో ఏదో ఒక రోజున పవన్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ డాలీ దర్శకత్వం లో 'కాటమరాయుడు' సినిమా చేస్తున్నాడు..ఈరోజు నుండి హైదరాబాద్ లో చివరి షెడ్యూల్ మొదలుపెట్టింది. ఫిబ్రవరి మొదటి వారం లో ఈ షెడ్యూల్ పూర్తి అవుతుందని సమాచారం. ఉగాది కానుకగా సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు నిర్మాత శరత్ మరార్ తెలుపుతున్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







