చిరంజీవి 151 చిత్రంగా 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి'
- January 16, 2017
చిరంజీవి తన 151 చిత్రంగా చారిత్రక నేపథ్యం వున్న 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' ఇతివృత్తాన్ని ఎంచుకోబోతున్నారని సినీవర్గాల అంచనా. సంక్రాంతికి చిరు సినిమాకు పోటీగా చారిత్రక నేపథ్యం వున్న 'శాతకర్ణి' సినిమాను బాలయ్య ఎంచుకుని సక్సెస్ కొట్టడం.. అటువంటి బ్యాక్‌డ్రాప్ వున్న కథాంశంతో ముందుకువెళ్తే తన మార్క్‌ను నిరూపించుకోవచ్చన్న ఆలోచనలో మెగాస్టార్ వున్నట్లు చెబుతున్నారు. గతంలోనే ఈ సినిమా చేయాలన్న ఆలోచనలు జరిగినా.. తన రీఎంట్రీ మూవీగా ఇది నప్పదేమోనన్న ఉద్దేశాలతో పక్కనబెట్టారని.. ఇప్పుడున్న వాతావరణంలో అటు ప్రేక్షకులు, ఇటు అభిమానులు చిరును ఈ క్యారెక్టర్‌లో ఆదరిస్తారన్నది అంచనా కావచ్చు. బాలయ్య తన 100వ చిత్రంగా 'శాతకర్ణి' కథను ఎంపిక చేసుకోవడంతోనే 50 శాతం విజయం సాధించారని చిరు స్వయంగా పేర్కొన్న విషయం తెలిసిందే!
అయితే బాలయ్య ఒక చారిత్రాత్మక నేపథ్యం వున్న సినిమా చేసి విజయం సాధించారు కనుక తాను కూడా మళ్ళీ అటువంటి చారిత్రక నేపథ్యపు సినిమాను ఎంపిక చేసుకున్నారంటూ ఎక్కడ విమర్శలు ఎదురవుతాయోనంటూ సినీవర్గాలే సణుగుతున్నాయి. కానీ తన ఉయ్యాలవాడ ఇతివృత్తం గతంలోనే నిర్ణయించుకున్నారు కనుక అటువంటి అభిప్రాయాల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదనేది కొంతమంది చిరు ఫ్యాన్స్ వాదన. ఇదిలావుంటే మొన్నటికిమొన్న అల్లుఅర్జున్ ప్రెస్‌మీట్ పెట్టి చిరు 151 సినిమా కొణిదెల బ్యానర్ మీదే నిర్మిస్తున్నారని.. 152 సినిమా మాత్రం తమ సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ పేరు మీదే నిర్మిస్తున్నామంటూ ప్రకటించారు. ఏదైతేనేం.. ఈసారి తన సినిమా కథాంశాన్ని ఎంపిక చేసుకోవడంలో చిరంజీవి కచ్ఛితంగా సరైన నిర్ణయం తీసుకోకపోతే ఇబ్బంది పడడం ఖాయం!
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







