'ఎ ఫర్ అమెరికా' సినిమాకి నటీనటులు కావలెను
- January 16, 2017
దర్శకుడిగా, నిర్మాతగా విభిన్న చిత్రాల్ని రూపొందించిన మధుర శ్రీధర్‌రెడ్డి, ప్రస్తుతం 'ఫ్యాషన్ డిజైనర్ సన్ ఆఫ్ లేడీస్ టైలర్' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం విదితమే. 30 ఏళ్ళ క్రితం రాజేంద్రప్రసాద్ హీరోగా సంచలన విజయాన్ని అందుకున్న 'లేడీస్ టైలర్' సినిమాకి ఇది సీక్వెల్. వంశీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.
ఇదిలా ఉండగా, మధుర శ్రీధర్ మరో చిత్ర నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. 'ఎ ఫర్ అమెరికా' పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి సుజయ్ - సుశీల్ అనే దర్శక ద్వయం దర్శకత్వం వహించనుండడం గమనార్హం. సుజయ్- సుశీల్ చెప్పిన కథ తనకు బాగా నచ్చిందనీ, ఇదొక కాంటెంపరరీ అర్బన్ కామెడీ జోనర్లో ఉంటుందనీ, కథ వినగానే ఈ సినిమాని నిర్మించాలనే నిర్ణయానికి వచ్చానని మధుర శ్రీధర్‌రెడ్డి చెప్పారు. మరో ఔత్సాహిక నిర్మాత అప్పిరెడ్డితో కలిసి ఈ చిత్రాన్ని ఆయన నిర్మిస్తున్నారు. 'ఎ ఫర్ అమెరికా' సినిమా కోసం కొత్త నటీనటుల్ని తీసుకోవాలనుకుంటున్నారు. ఇందు కోసం ఔత్సాహికుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నారు. ఔత్సాహికులెవరైనా తమ ప్రొఫైల్స్‌ని పంపించవచ్చని మధుర శ్రీధర్‌రెడ్డి చెప్పారు. ఈ చిత్రానికి సునీల్ కాశ్యప్ సంగీతం అందిస్తున్నారు. ఔత్సాహికులు తమ ప్రొఫైల్స్‌ని ఈ-మెయిల్ ద్వారా పంపించవచ్చు.
ఈ-మెయిల్: [email protected]
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







