సూర్య 'ఎస్3' విడుదలకు సిద్ధం..
- January 17, 2017
హీరో సూర్య, అనుష్క, శ్రుతిహాసన్ ప్రధాన తారాగణంగా తెరకెక్కిన 'ఎస్ 3 (యముడు-3)' చిత్రం విడుదలకు సిద్ధమైంది. హరి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని జనవరి 26న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా నిర్మాత మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ.. 'తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో తన నటనతో ప్రత్యేక అభిమానుల్ని సంపాదించుకున్న సూర్య, హరి కాంబినేషనల్లో రూపొందిన 'యముడు', 'సింగం' చిత్రాలు ఘన విజయం సాధించాయి. వాటికి కొనసాగింపుగా వస్తోన్న చిత్రం 'ఎస్3'.
దర్శకుడు చిత్రాన్ని యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. పరుగులు పెట్టే స్క్రీన్‌ప్లేతో థ్రిల్‌ని కలిగించే సన్నివేశాలతో ఈ చిత్రం సాగుతుంది. ఇప్పటికే విడుదలైన టీజర్లతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు చిత్రం ఉండబోతోంది.
నీతి నిజాయితీలే వూపిరిగా భావించే ఓ పోలీసు అధికారి వృత్తి నిర్వహణలో తనకు ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడన్నదే ఈ చిత్ర ఇతివృత్తం' అని తెలిపారు..
హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. రాధికా శరత్‌కుమార్, నాజర్, రాడాన్ రవి, సుమిత్ర తదితరులు చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







