విజయ్ మద్దతు 'జల్లికట్టు'కు...
- January 18, 2017
చెన్నై: జల్లికట్టుకు మద్దతుగా హీరో విజయ్ మంగళవారం రాత్రి ఒక వీడియోను విడుదల చేశారు. అందులో విజయ్ మాట్లాడుతూ.. 'ప్రపంచ వ్యాప్తంగా చట్టాలను తీసుకు వచ్చింది ప్రజల సంస్కృతి కాపాడటం కోసమే. తమిళుడి గుర్తింపు 'జల్లికట్టు'. దేనికి ఆశపడకుండా, ఎవరి ప్రోత్సాహం లేకుండా స్వచ్ఛందంగా 'జల్లికట్టు' జరపాలని ఆందోళన చేయడానికి ముందుకు వచ్చిన యువకులందరికీ నేను తలవంచుతున్నాను. దీనికి సంబంధించి అరెస్టు చేసిన యువకులను విడుదల చేస్తే నేను సంతోషిస్తాను. దీనికంతటికీ కారణమైన పెటాను ఇక్కడి నుంచి తరిమికొడితే తమిళనాడు సంతోషిస్తుంది' అని తెలిపారు.
రాఘవ లారెన్స్ మద్దతు: జల్లికట్టుకు మద్దతుగా రాఘవ లారెన్స్ మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో.. తమిళుడి వీరత్వానికి నిదర్శనం 'జల్లికట్టు' అని పేర్కొన్నారు.
జల్లికట్టుపై నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అలంగానల్లూరులో అరెస్టు చేసిన విద్యార్థులను విడుదల చేయాలని కోరారు. మనం నిత్య ఆహారం కోసం, దుస్తులు, చెప్పులు, ఔషధాలు అంటు పలు విషయాల కోసం జంతువులను వధించి ఉపయోగించుకుంటున్నామన్నారు. అటువంటిది తమిళ సంస్కృతిని కాపాడుకోవడానికి సంవత్సరంలో కేవలం మూడు రోజులు ఎద్దులను వినియోగించడం వలన వచ్చే నష్టం ఏమిటని ప్రశ్నించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







