ఎన్టీఆర్ 27వ చిత్రం...
- January 18, 2017
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ హీరోగా ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న 27వ చిత్రానికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'జై లవ కుశ' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు టాక్.
చిత్ర నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ బేనర్ వారు ఈ నెల మొదటి వారంలో 'జై లవ కుశ' టైటిల్ రిజిస్టర్ చేయించడంతో ఈ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆగస్టులో రిలీజ్ అయ్యేలా సినిమా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో కనిపిస్తారని టాక్. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించబోతున్న ఈచిత్రానికి బాలీవుడ్లో 3 ఇడియట్స్, పికె, మోహంజోదారో లాంటి భారీ చిత్రాలకు పని చేసిన సినిమాటోగ్రాఫర్ సికె మురళీధరన్ పనిచేయబోతున్నారు.
రవితేజ తో 'పవర్', పవన్ కళ్యాణ్ తో 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలను తరకెక్కించిన కెఎస్ రవీంద్ర ఈచిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు. త్వరలో నటీనటుల వివరాలు ప్రకటించబోతున్నారు.
ఇప్పటికే టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాలతో వరుస హిట్లు కొట్టిన ఎన్టీఆర్ 'జై లవ కుశ' పేరుతో సినిమా చేస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి రావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతోందనే విషయం ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా 'జై లవ కుశ' టైటిల్ విషయంలో అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







