ఆరునెలలు హెయిర్ కటింగ్ ప్రీ ఆడపిల్ల పుడితే...

- January 19, 2017 , by Maagulf
ఆరునెలలు హెయిర్ కటింగ్ ప్రీ ఆడపిల్ల పుడితే...

ప్రభుత్వమే ఏదో చేయాలి అని అనుకోకుండా తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు మహారాష్ట్ర బీద్ జిల్లాలోని కుంభెఫల్. బీద్ జిల్లా లింగ నిర్ధారణ పరీక్షలు, భ్రూణ, శిశు హత్యలతో ఓ అపవాదును మూటగట్టుకుంది. లింగ వివక్ష, ఆడశిశువు, భ్రూణహత్యలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఓ సెలూన్ ఓనర్ వినూత్మ ఆలోచనకు శ్రీకారం చుట్టాడు.  తన స్వగ్రామంలో ఎవరికైతే ఆడపిల్ల పుడుతుంతో ఆ పాప తండ్రికి ఆరునెలల పాటు ఉచితంగా హెయిర్ కట్, షేవింగ్ చేస్తానంటున్నాడు. ఆడపిల్లకు పుట్టువెంట్రుకలు కూడా ఉచితంగా తీస్తానంటున్నాడు. 
ఆడపిల్లను వద్దనుకుంటున్న తల్లిదండ్రుల్లో మార్పు తీసుకురావాలని భావించిన అశోక్ తన  సెలూన్ దగ్గర బోర్డు కూడా ఏర్పాటు చేశాడు.  అయితే ఇది మొదటి 15 మందికి మాత్రమే వర్తిస్తుందని తరువాత నుంచి రూ.50 చెల్లించాల్సి ఉంటుందంటున్నాడు.  దీనిపై అశోక్ పవార్ మాట్లాడుతూ కొంతమంది ఆడపిల్లను వద్దనుకోవడానికి ఖర్చు పెరుగుతుందన్న అపోహ కూడా ఓ కారణమని అందుకే అలాంటి వారి కోసమే ఈ బోర్డును ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com