గల్ఫ్‌లో థియేటర్లన్నీ ఖైదీకే...
- January 20, 2017
మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నంబర్ 150, బాలకృష్ణ వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచి బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. ఒక్కరోజు గ్యాప్‌లో రెండు సినిమాలు బాక్సాఫీస్ ముందుకొచ్చాయి. కానీ, గౌతమిపుత్ర శాతకర్ణిని మాత్రం ఓ వారం పాటు వెనక్కు నెట్టేసింది ఖైదీ నంబర్ 150 సినిమా. ఒక్కరోజు గ్యాప్‌తోనే విడుదలైంది కదా.. మరి వారం వెనక్కు నెట్టడమేంటి అనేనా సందేహం. వారం వెనక్కు నెట్టింది ఇక్కడ కాదు. గల్ఫ్ కంట్రీస్‌లో. అందుకు కారణం థియేటర్ల కొరతే. అక్కడ తెలుగు సినిమాలు ప్రదర్శించే అన్ని థియేటర్లలోనూ ఖైదీ నంబర్ 150 సినిమానే ప్రదర్శిస్తున్నారట. దీంతో శాతకర్ణి సినిమాకు అక్కడ థియేటర్లను కేటాయించలేదు. దీంతో గల్ఫ్‌లో శాతకర్ణిని విడుదల చేయకుండా ఆపేశారు. సినిమా నిర్మాతలు కూడా చేసేదేం లేక మిన్నకుండిపోయారట. దీంతో ఇప్పుడు దుబాయ్ తెలుగు అసోసియేషన్ రంగంలోకి దిగి గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకు తగినన్ని థియేటర్లు కేటాయించేలా చర్యలు చేపట్టింది. సినిమా బాగుందన్న టాక్ రావడంతో గౌతమిపుత్ర శాతకర్ణికి అక్కడి నుంచి డిమాండ్ బాగానే పెరిగింది. దీంతో అక్కడ వారం తర్వాత ఇప్పుడు సినిమాను విడుదల చేశారు. ఇక, గల్ఫ్ కంట్రీస్‌లోనూ సినిమా విడుదలైపోవడంతో రెస్టాఫ్ ద వరల్డ్ కలెక్షన్లు పెరిగే అవకాశముందని అంటున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







