ఎయిర్ ఇండియా ఉద్యోగులు బరువు పెరిగారని బదిలీ వేటు...
- January 20, 2017
57 మంది ఎయిర్ ఇండియా ఉద్యోగులను బరువు పెరిగారని వారిని గ్రౌండ్ డ్యూటీలకు బదిలీ చేసింది. క్యాబిన్ క్రూ ఉద్యోగులుగా పనిచేస్తున్న 57 మంది ఉద్యోగుల్లో ఎక్కువమంది ఎయిర్ హోస్టెస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరు అధిక బరువు ఉన్నట్లు ఎయిర్ ఇండియా గత నెలలో గుర్తించింది. త్వరగా బరువు తగ్గించుకోపోతే శాశ్వత గ్రౌండ్ డ్యూటీ ఉద్యోగులుగా చేస్తామని హెచ్చరించింది కూడా.
డెడ్ లైన్ లోగా బరువు తగ్గాలని సూచించిన ఎయిర్ ఇండియా అందులో ఫెయిల్ అయిన వారిని గ్రౌండ్ జాబ్స్‌కు పంపినట్లు ఎయిర్ ఇండియా సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బాడీ మాస్ ఇండెక్స్ ప్రకారం.. అధిక బరువును కలిగివున్నట్లు గుర్తించామని చెప్పారు. గ్రౌండ్ జాబ్‌లో చేరడమంటే నెలకు 35 వేల నుంచి 50 వేల వరకు ప్లైయింగ్ అలవెన్స్‌ను కోల్పోయినట్లే. అధిక బరువు కలిగిన వారిని క్యాబిన్ క్రూ జాబ్‌కు తొలుత ఆరు నెలల పాటు అన్‌ఫిట్‌గా పరిగణిస్తారు. 18 నెలల్లోగా తిరిగి తక్కువ బరువును చూపించలేకపోతే పర్మినెంట్‌గా క్యాబిన్ క్రూ జాబ్‌కు అన్‌ఫిట్‌గా పరిగణిస్తారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







