రవితేజను అంధుడుని చేసేసారు...
- January 22, 2017
హైదరాబాద్: ఒక హీరోతో అనుకున్న కథ వేరే హీరోతో చేయటం, ముందుకు వెళ్లటం ఇండస్ట్రీలో అతి సాధారణ విషయం. అలాగే ఎన్టీఆర్ తో అనుకున్న కథతో ..రవితేజతో సినిమా ప్రారంభమవుతోంది. అలాగే ఈ చిత్రానికి టైటిల్ కూడా ఫైనల్ అయ్యింది.
వివరాల్లోకి వెళ్తే....తాజాగా రవితేజ... దర్శకుడు అనీల్ రావిపూడితో ఓ సినిమా చేయడానికి అంగీకరించాడు. ఇంతకుముందు విభేదాలు వచ్చిన దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నాడు రవితేజ. అనీల్ ఇంతకుముందు ఎన్టీయార్‌తో సినిమా చేయాలనుకున్నాడు. అయితే ఎన్టీయార్ బాబికి అవకాశమివ్వడంతో అనిల్.. అదే కథను రవితేజకు చెప్పాడు. ఈ సినిమాకు 'రాజా..
ది గ్రేట్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ టైటిల్ రవితేజకు కరెక్ట్‌గా సరిపోతుందని అనిల్, దిల్‌రాజు నమ్మకంతో ఉన్నారట.
రామ్ దగ్గర్నుంచి ఎన్టీఆర్... అక్కణ్ణుంచి అటూ ఇటూ తిరిగిన బ్లైండ్‌మ్యాన్ స్టోరీ, చివరకు రవితేజ దగ్గరికి చేరిందని చెప్తున్నారు. ఈ కథకు రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని సమాచారం. 'పటాస్', 'సుప్రీమ్' చిత్రాల ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుండంటతో మంచి క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు. ఇందులో రవితేజ అంధుడిగా కనిపించనున్నారని ఫిల్మ్‌నగర్ వర్గాల సమాచారం.
''ఆల్మోస్ట్ స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ వెర్షన్ పూర్తయింది. మార్చిలో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రవితేజ పాత్ర, సినిమా చాలా కొత్తగా ఉంటుంది'' అని యూనిట్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఇందులో రవితేజకి జోడీగా రాశిఖన్నా, 'కృష్ణగాడి వీర ప్రేమగాథ' ఫేమ్ మెహరీన్ కౌర్ నటించనున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







