ఇండియా - యూఏఈ 'విన్ విన్' టై అప్స్
- January 23, 2017
భారత్, యూఏఈ మధ్య సత్సంబంధాలు ఎప్పటికీ కొనసాగుతాయని భారత కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. భారత అభివృద్ధిలో యూఏఈ అత్యంత నమ్మదగిన భాగస్వామి అని ఆయన చెప్పారు. వివిధ అంశాల్లో యూఏఈతో తమ సన్నిహిత సంబంధాలు కొనసాగుతాయని అన్నారాయన. రిపబ్లిక్ డే వేడుకల్లో అబుదాబీ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ సుప్రీం కమాండర్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, భారత రిపబ్లిక్ వేడుకల్లో పాల్గొననున్నారు. భారత ప్రధాని నరేంద్రమోడీ, క్రౌన్ ప్రిన్స్ మధ్య స్నేహపూర్వక వాతావరణంలో పలు అంశాలపై చర్చలు జరగనున్నాయి. యూఏఈ అభివృద్ధిలో భారతీయ వలసదారులు అత్యంత కీలక భూమిక పోషిస్తున్నట్లు ఈ సందర్భంగా గోయల్ చెప్పారు. అలాగే యూఏఈకి చెందిన పలు కంపెనీలు భారతదేశంలో పెట్టుబడులు పెట్టాయి. తద్వారా భారత్ - యూఏఈ పలు అంశాల్లో విన్ విన్ సంబంధాలు కొనసాగిస్తున్నాయి. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా షేక్ మొహమమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తోపాటు, పలువురు ప్రముఖులు ఆయన వెంట ఉండనున్నారు. అలాగే 200 మంది యూఏఈ ఎయిర్ఫోర్స్ సిబ్బంది కూడా రిపబ్లిక్ డే పెరేడ్లో పాల్గొంటారు.
తాజా వార్తలు
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం







