కొత్త లుక్స్‌తో ఎనర్జిటిక్ హీరో రామ్...
- January 25, 2017
ఎనర్జిటిక్ హీరో రామ్ కొత్త సినిమా అనౌన్స్ చేయకపోయినా కొత్త లుక్స్‌తో ఎక్స్ పెరిమెంట్స్ చేస్తున్నాడు... మరి అబ్బాయిగారి కొత్త అవతారం దేనికోసమో చూద్దామా. గతేడాది 'నేను శైలజ', 'హైపర్'తో మిశ్రమ ఫలితాలను అందుకున్న రామ్... నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను టేకప్ చేసేందుకు చాలా టైమ్ తీసుకుంటున్నాడు. మరోసారి 'నేనుశైలజ' వంటి హిట్ అందుకోవాలని తపిస్తున్న రామ్ స్క్రిప్ట్‌లను కాచి వడబోస్తున్నాడు. అప్పటి వరకూ ఖాళీగా ఉండటం ఎందుకనుకున్నాడో ఏమో లుక్స్‌పై కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. రేర్‌గా పబ్లిక్‌లోకి వస్తున్న రామ్ గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. కంప్లీట్ మేకోవర్ అయిన ఈ ఎనర్జిటిక్ హీరో ట్విట్టర్ ద్వారా తన కొత్త లుక్స్‌ను రివీల్ చేశాడు.
రామ్ కొత్త గెటప్ చాలా ఇంట్రెస్టింగ్‌గా కనిపిస్తోంది. అయితే అబ్బాయి ఏ సినిమా కోసం ఈ అవతారం అన్న విషయంలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటి వరకూ ఏ ప్రాజెక్ట్‌కూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వని రామ్ త్వరలో కరుణాకరణ్ తోనూ, 'నేనూ శైలజ' దర్శకుడు కిశోర్ తిరుమల తోనూ సినిమాలు చేయబోతున్నాడు. మరి ఇరువురిలో ఎవరి చిత్రంలో రామ్ కొత్త అవతారంతో దర్శనమిస్తాడో చూడాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







