కాల్పుల విరమణపైనే దృష్టి ...
- January 25, 2017
- కాల్పుల విరమణపైనే దృష్టి
- రెబెల్స్ దురుసుగా వ్యవహరిస్తున్నారని సిరియా ఆరోపణ
- సిరియాలోని ఐఎస్ లక్ష్యాలపై రష్యా బాంబు దాడి
అస్తానా : సిరియా సంక్షోభాన్ని పరిష్కరించే లక్ష్యంతో కజకస్తాన్ రాజధాని అస్తానాలో ఆది, సోమవారాల్లో జరిగిన చర్చలు ఒక కొలిక్కి రాలేదు. ప్రధానంగా కాల్పుల విరమణ ఒప్పందం అమలుపైనే దృష్టి కేంద్రీకరించినప్పటికీ ఫలితం కానరాలేదు. విస్తృత రాజకీయ పరిష్కారాన్ని కనుగొనే దిశగా చర్యలు తీసుకోవడానికి ముందుగా ఇరు పక్షాలు కాల్పుల విరమణ ఒప్పందంపైనే చర్చించాయి. గత తొమ్మిది మాసా ల్లో మొదటిసారిగా సిరియా ప్రభుత్వం, రెబెల్స్ మధ్య చర్చలు జరిగాయి.
అంతర్జాతీయ వేదికపై ఇలా ఇరు పక్షాలు సమా వేశమవడమే ఒక ముఖ్యమైన చర్యగా పరిగణిస్తున్నారు. ఇరు వర్గాలు కూడా వారి విదేశీ మద్దతుదారులతో కలిసే సమావేశ మయ్యాయి. సమావేశ వేదికపై ఇరాన్ ప్రతినిధి బృందం వుండడాన్ని రెబెల్స్ వ్యతిరేకించడంతో 40నిముషాలు ఆల స్యంగా సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాల్పుల విరమణ ఒప్పందంలో లేదా పరిష్కారంలో నుస్రా ఫ్రంట్‌ను మినహా యించాలని ప్రభుత్వం పేర్కొంటుండగా కుదరదని రెబెల్స్ పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా వెలువడిన సంకేతాలు చూస్తుంటే గణనీయమైన పురోగతి వుండే అవకాశాలు తక్కు వగానే వున్నాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ తరు పు ప్రాతినిధ్యం వహిస్తున్న బషర్ అల్ జఫరీ మాట్లాడుతూ, రెబెల్స్ తరపు ప్రతినిధులు చాలా దురుసుగా, అనైతికంగా వ్యవహరించారని పేర్కొన్నారు. నూర్సా ఫ్రంట్‌గా గతంలో వున్న జబత్ ఫతే అల్ షామ్ పాల్పడిన యుద్ధ నేరాలను వారు సమర్ధిస్తున్నారని అన్నారు. మధ్యవర్తుల ద్వారా మాత్రమే ప్రభుత్వంతో మాట్లాడాలని తాము భావిస్తున్నట్లు రెబెల్ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష ప్రతినిధి బృందం నాయకుడు మహ్మద్ అలౌష్ బృందం సభ్యులతో మాట్లాడుతూ, అరకొరగా వున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరింత సంఘటితంగా చేయడం, సైనిక కార్యకలాపాలను స్తంభింపచేయడం ద్వారా రక్తపాతాన్ని నివారించాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇరాన్ మద్దతు గల తీవ్రవాదులు సిరియా వదిలి వెళ్ళిపోవాలని అన్నారు. ఇదిలావుండగా, ఇస్లామిక్ స్టేట్, జబత్ ఫతే అల్ షామ్లపై ఉమ్మడిగా పోరు సల్పుతామని, డిసెంబరు 30నుండి అమల్లోకి వచ్చిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని పర్యవేక్షిస్తామని రష్యా, టర్కీ, ఇరాన్‌లు ప్రకటించాయి. అయితే అసద్ అనుకూల రష్యాకు, అసద్ వ్యతిరేక రెబెల్స్‌కు మద్దతిచ్చే టర్కీకి మధ్య ప్రాథమికమైన విభేదాలు అలాగే కొనసాగుతున్నాయి. సిరియా అధ్యక్షుడు అధికారంలో కొనసాగాలని రష్యా, పదవి నుండి వైదొలగాలని టర్కీ డిమాండ్ చేస్తున్నాయి.
రష్యా బాంబు దాడి
ఒకపక్క చర్చలు కొనసాగుతుండగా సిరియాలోని ఐఎస్ లక్ష్యాలపై రష్యా బాంబు దాడి జరిపింది. రష్యా నుండి బయలుదేరిన విమానం ఐఎస్ కమాండ్ పోస్టులపైనా, ఆయుధాగారాలపైనా బాంబులు వేసిందని, అనుకున్న లక్ష్యాలన్నింటి నీ ఆరు బాంబర్లు నాశనం చేశాయని రష్యా రక్షణ శాఖ అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







