ఘుబ్రా లో రోడ్డుపై పోట్లాడుకొంటున్న 7 గురు ఆసియా దేశస్థులు అరెస్ట్..
- January 25, 2017
సినిమాలలో రోడ్లపై విలన్లతో కొట్లాడుతుంటే వారు హీరోలుగా చెలామణి అవుతారు సినిమాలలో చాలా సందర్భాలలో పోలీసులు ఏమాత్రం పట్టించుకోరు..పైగా సినిమాలలో రోడ్ల పక్కన ఉన్న కుండలను ,తినుబండారాల దుకాణాలపై అమాంతంగా ఎగిరెగిరి పడీ వస్తువులను ధ్వంసంచేస్తుంటారు..బహుశా వారిని ప్రేరణాగా తీసుకొనెమో నడిరోడ్డుపై ముష్టి యుద్ధాలకు ఆ ఏడుగురు ఆసియా దేశస్థులు దిగేరు. కానీ అక్కడ బుషెర్ పోలీసులు కాస్తంత ఎక్కువ చురుకైనవారు కావడంతో వీరి వీధి పోరాటాలు చప్పున ఆగిపోయాయి. దక్షిణ ఘుబ్రాలో బహిరంగ ప్రదేశంలో వద్ద ఏడుగురు ఆసియా దేశస్థులు రోడ్లపై ఒకరినొకరు తన్నుకొంటూ ట్రాఫిక్ అంతరాయం కల్గిస్తూ ఆ ప్రాంతాన్ని గందరగోళం గురిచేస్తున్నారని సమాచారం అందడంతో బుషెర్ పోలీసులు వారందరిని అరెస్టు చేసింది. దక్షిణ ఘుబ్రాలో నిర్వాసితుల బృందం రోడ్దుపై ఒకరినొకరు తన్నుకొంటున్నారనే సమాచారం ఒక ఫోన్ కాల్ అందుకున్నామని ఒక రాయల్ ఒమాన్ పోలీస్ అధికారి అన్నారు. "మేము వెంటనే గస్తీ వాహనం మరియు ఒక అంబులెన్స్ తో అక్కడకి వచ్చినట్లు తెలిపారు. పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసినట్లు మరో నలుగురిని చికిత్స కోసం ఖోయూల హాస్పిటల్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. ఈ ఏడుగురిని తదుపరి దర్యాప్తు కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఎదుటకు హాజరుపర్చారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







