బాహుబలి-2 కొత్త పోస్టర్...
- January 26, 2017
తెలుగు సినీ చరిత్రకు కొత్త రికార్డులను పరిచయం చేసి కొత్త దిశను చూపిన చిత్రం బాహుబలి. అందులో ఎలాంటి సందేహం లేదనేది సినీ అభిమానులు, విశ్లేషకుల మాట. తెలుగు సినిమాకు అసలైన విజువల్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో చూపించాడు సినిమా జక్కన్న రాజమౌళి. బాహుబలి సినిమాతో కొత్త రికార్డులను రుచి చూపించాడు జక్కన్న. ఇప్పుడు అదే ఉత్సాహంతో బాహుబలి-2ని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఈ సినిమాపై ఎన్నెన్నో అంచనాలున్నాయి. బాహుబలి సినిమానే అలా ఉంటే.. ఆ సినిమా ఇంకా ఎలా ఉండాలి? ఏ రేంజ్‌లో ఉండాలి? అందుకే రెండున్నరేళ్లు కష్టపడ్డాడు జక్కన్న, అతడి టీమ్. సినిమాకు సంబంధించిన ఏ ఒక్క విషయమూ బయటకు రాకుండా అత్యంత పకడ్బందీగా తెరకెక్కించాడు.
ఇప్పుడు ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకొంటోంది. ఇక, ఈ సినిమాకు సంబంధించి ఇంతకుముందే ఫస్ట్‌లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ విడుదల చేసిన రాజమౌళి, తాజాగా ప్రభాస్, బాహుబలి అభిమానులకు కనులవిందు చేయబోతున్నాడు. బాహుబలి-2 సినిమా కొత్త ఫొటోను విడుదల చేశాడు. ప్రభాస్, అనుష్క ఇద్దరు కలిసి విల్లు ఎక్కుపెట్టిన ఫొటోను గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమౌళి విడుదల చేశాడు.
ఆ ఫొటో విజువల్‌గా సూపర్‌గా ఉంది. రాజమౌళి స్టామినా ఏంటో ఈ ఒక్క ఫొటోనే నిరూపిస్తోంది. బాహుబలి మోషన్ పోస్టర్‌తో జక్కన్న కాస్తంత నిరాశ పరిచినా.. ప్రభాస్, అనుష్క ఫొటోతో ఆ నిరాశను పోగొట్టేశాడు.
మొత్తానికి బాహుబలి-2 కొత్త ఫొటో సూపర్ అనే చెప్పాలి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







