'సోక్కాలి మైనర్'గా నాగార్జున...
- January 26, 2017
చెన్నై: తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడైన నటుడు నాగార్జున. ఇటీవల 'తోళా' సినిమాతో తమిళ తంబిలను మరింత ఆకట్టుకున్నారు. రొటీన్‌కు భిన్నమైన నటనతో ఇక్కడ కూడా కార్తితో కలసి హిట్‌ను సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా కల్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగార్జున ఇటీవల తెలుగులో నటించిన 'సోగ్గాడే చిన్ని నాయనా' చిత్రం తమిళంలో 'సోక్కాలి మైనర్'గా అనువాదమవుతోంది. ఇందులో రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి, నాజర్ తదితరులు నటించారు. ప్రస్తుతం అనువాదం పనులు శరవేగంగా సాగుతున్నాయి. తమిళ నేటివిటీకి తగ్గట్టుగా మాటలను మలుస్తున్నారు. పంచెకట్టుతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగార్జున ఫిబ్రవరిలో తమిళ ప్రేక్షకులను అలరించేందుకు తెరపైకి రానున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







