స్నేహితుడి హత్య: వ్యక్తికి జీవిత ఖైదు
- January 27, 2017
మనామా: బహ్రెయినీ వ్యక్తికి స్నేహితుడిని హత్య చేసిన కేసులో జీవిత శిక్ష విధించింది న్యాయస్థానం. గత ఏడాది ముహర్రాక్లో ఈ హత్య జరిగింది. మార్చ్ 2016 జరిగిన ఈ హత్యకేసు వివరాల్లోకి వెళితే, ముగ్గురు యువకుల్ని ఈ ఘటనలో నిందితులుగా తేల్చారు. 20 ఏళ్ళ యువకుడు, తన స్నేహితుడు అబ్దుల్కాదెర్ అల్ కూహెజిని కత్తితో పొడిచి చంపేశాడు. వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు విచారణలో తేల్చారు. హత్య అనంతరం, కత్తిని సముద్రంలో విసిరివేశాడు. ఈ ఘటనలో హంతకుడ్ని వారించేందుకు మరో వ్యక్తి ప్రయత్నించగా, అతని మీద కూడా దాడి జరిగింది. హంతకుడు హత్యా నేరాన్ని అంగీకరించడంతో, అతనికి హై క్రిమినల్ కోర్టు జీవిత ఖైదును ఖరారు చేసింది.
తాజా వార్తలు
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!







