బాత్రూమ్‌లో లాక్ అయిన బాలుడు: రక్షించిన పోలీసులు
- January 27, 2017
ప్రత్యేకావసరాలు గల ఓ వ్యక్తి, అనుకోకుండా బాత్రూమ్ డోర్ లాక్ అవడంతో అక్కడే ఇరుక్కుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి, ఆ బాలుడ్ని రక్షించారు. దుబాయ్ పోలీస్ - డైరెక్టర్ ఆఫ్ ది ఆపరేషన్స్ రూమ్‌కి ఓ వ్యక్తి ఫోన్ చేశాడనీ, అయితే మాట్లాడే స్థితిలో లేని అతని ఫోన్ కాల్ వెంటనే డిస్కనెక్ట్ అయ్యిందనీ, ఈ విషయం వెంటనే తెలుసుకుని, తక్షణం స్పందించి, ఆ బాలుడ్ని రక్షించినట్లు ఇంజనీర్ కమిల్ బట్టి అల్ సువైది చెప్పారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా లొకేషన్‌ని ట్రేస్ చేసి, ఆ బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఇటీవలి కాలంలో 369 కాల్స్ ఇలాంటివి తమకు వచ్చాయని అల్ సువైది చెప్పారు. ప్రత్యేకావసరాలు గల వ్యక్తుల విషయంలో కుటుంబ సభ్యులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలనీ, స్ట్రెస్ ఎక్కువైతే వారి ఆలోచనల్లో మార్పు వస్తుందని, అది ప్రమాదాలకు దారి తీస్తుందని, అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటాయని ఆయన చెప్పారు. 8,000 మంది స్పెషల్ నీడ్స్ గల వ్యక్తుల వివరాల్ని ఆపరేషన్ రూమ్‌తో లింక్ చేసినట్లు ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







