పీకే కి షాక్ ఇచ్చిన బ్రహ్మి!!
- September 14, 2015
1000 కు పైగా సినిమాలలో నటించి ఎన్నోరకాల పాత్రలు పోషించిన బ్రహ్మానందం బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ ను అనుసరిస్తూ ఒక తెలుగు సినిమాలో కనిపించబోతున్నాడు. తన నటనతో ఎందరి పైనో సెటైర్లు వేసిన బ్రహ్మీ ఈసారి ఏకంగా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ ను టార్గెట్ చేస్తూ నటించడం హాట్ టాపిక్ గా మారింది. బ్రహ్మీ ఈ సాహసాన్ని ఆది హీరోగా నటిస్తున్న 'గరం' సినిమాలో చేస్తున్నాడు. అమీర్ ఖాన్ డ్రెస్ లుక్ తో ట్రాన్సిస్టర్ మెడలో వేసుకుని హడావిడి చేస్తున్న ఫోటోను హీరో ఆది తన ఫేస్ బుక్ లో పెట్టి అందరికీ షేర్ చేసాడు. క్రియేటివ్ దర్శకుడిగా పేరు గాంచిన మదన్ దర్శకత్వంలో బ్రహ్మీ ఈ సాహసం చేస్తున్నాడు. హీరో ఆది పక్కన ఆదా శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బ్రహ్మానందం 'పికె' సినిమాలోని అమీర్ ఖాన్ పాత్రను ప్యారడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈమధ్య కాలంలో తెలుగు సినిమాలలో బ్రహ్మీ హవా బాగా తగ్గిపోయి యంగ్ కమెడియన్ ల జోర్ పెరిగిన నేపధ్యంలో తిరిగి తన రేంజ్ ని చూపెట్టుకోవడానికి బ్రహ్మానందం ఏకంగా అమీర్ ఖాన్ నే టార్గెట్ చేస్తున్నాడు అనుకోవాలి. ఈ వెరైటీ ప్రమోగాన్ని ప్రేక్షకులు ఆదరిస్తే హిట్ సినిమాలకు దూరంగా ఉన్న ఆదికి బ్రహ్మీ ప్రయోగం అదృష్టంగా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈఫోటో వెబ్ మీడియాకే హాట్ టాపిక్ గా మారింది.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







