బిగ్ బి పాత్ర ను పందించనున్న వెంకి !
- September 14, 2015
విక్టరీ వెంకటేష్ అంటే సినిమా కోసం ఎంతటి త్యాగాన్నైనా చేసే మహోన్నత వ్యక్తి అని మనకందరికి తెలుసు. ఆ హీరో పూనుకోబట్టే మన తెలుగులో కూడా మల్టీస్టారర్ సినిమాలు వస్తున్నాయ్. పాత్ర చిన్నదైనా పెద్దదైనా పరిశ్రమకు ఉపయోగపడుతుందంటే చాలు విక్టరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే. అయితే ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ తీసుకున్న నిర్ణయం పట్ల తన అభిమానుల్లో గుబులు పుట్టిస్తుందని టాక్. తెలుస్తున్న కథానాల ప్రకారం బాలీవుడ్ సెన్షేషనల్ మూవీ 'పీకూ' సినిమా టాలీవుడ్లో రీమేక్ అవ్వబోతుందన్న సంగతి తెలిసిందే. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్లో ఆ సినిమా రీమేక్ రైట్స్ కోసం సురేష్ బాబు బాగా ట్రై చేస్తున్నాడు. దాదాపు సురేష్ బాబుకి పీకూ రైట్స్ వచ్చేసినట్టేనట. అయితే ఈ సినిమాలో తెలుగులో తీయడానికి స్టార్ కాస్ట్ ఎవరా అన్నది ఇప్పుడు పెద్ద సమస్య అయ్యింది. అమితాబ్, దీపికా పదుకునే, ఇర్ఫాన్ ఖాన్ నటించిన ఈ సినిమా తెలుగులో ఎవరెవరు చేయబోతున్నారన్నదే ఇప్పుడు పెద్ద ఫజిల్. అయితే తెలుస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో అమితాబ్ క్యారక్టర్లో వెంకటేష్ ని సెట్ చేసే పనిలో ఉన్నారట. సురేష్ ప్రొడక్షన్ ఎలాగూ తన ఓన్ బ్యానరే కాబట్టి దానికోసం వెంకటేష్ ఖచ్చితంగా రిస్క్ తీసుకోక తప్పదు. కాని అమితాబ్ కి సూట్ అయ్యే క్యారక్టర్లో వెంకటేష్ నప్పుతాడా అన్నది అర్ధం కాని ప్రశ్న. పికూ సినిమాలో మలబద్ధకంతో బాధపడే తండ్రిలా అద్భుతంగా చేశాడు బిగ్ బీ అమితాబ్. మరి తెలుగులో వెంకటేష్ ని మలబద్ధకపు వ్యక్తిగా ఆడియెన్స్ రిసీవ్ చేసుకుంటారా..లేదా అన్నది చూడాలి. పీకూ సినిమాలో అమితాబ్, దీపికా పదుకునే, ఇర్ఫాన్ ఖాన్ : అంతేకాదు హిందీలో దీపిక చేసిన లీడ్ క్యారక్టర్ కి సమంతను తీసుకునే ఆలోచనలో ఉన్నారు సురేష ప్రొడక్షన్ టీం. అయితే ఆ లెక్కన చూసుకుంటే సమంత ఫాదర్ గా వెంకటేష్ కనపడతాడన్న మాట. సో మరీ ఇంత ప్రయోగం అవసరమా విక్టరీ బాసు... పీకు సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన ఇర్ఫాన్ ఖాన్ పాత్రను ఎవరు పోషిస్తారో తెలియదు. మొత్తానికైతే వెంకటేష్ పీకూ తెలుగు రీమేక్లో అమితాబ్ పాత్రలో కనిపిస్తాడన్నది మాత్రం ఇప్పటికి కన్ఫాం అయ్యింది. అయితే తెలుగులో వెంకటేష్ ఇమేజ్ దృష్ట్యా కథలో కొన్ని చేర్పులు మార్పులు చేస్తున్నారట చిత్ర యూనిట్. ఇంత ప్రెస్టీజియస్ గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ని నువ్వు నాకు నచ్చావ్ విజయభాస్కర్ డైరెక్ట్ చేస్తారని టాక్. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయ్.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







