రూ.5కే భోజనం.. 5లక్షల బీమా.. 25లక్షల జాబ్స్...
- January 27, 2017
రొటీన్ పాలిటిక్స్‌కు భిన్నంగా బరిలోకి దిగి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు పంజాబ్ అసెంబ్లీ పై కన్నేసింది. లోక్‌సభ ఎన్నికల్లో 4 స్థానాలు సాధించిన ఊపుతో అకాలీదళ్- భాజపా కూటమితో పాటు కాంగ్రెస్ పార్టీకి పోటీగా ఫిబ్రవరి 4న 117 స్థానాలకు జరుగనున్న ఎన్నికల బరిలో దూసుకుపోతోంది. ఆపార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పంజాబ్ ప్రజలపై హామీల వర్షం కురిపించింది.
అధికారం చేపట్టిన నెలలో రాష్ట్రంలో మాదకద్రవ్యాలపై నిషేధం, బాధితులను ఆరునెలల్లో మామూలు మనుషులు చేయడం.. యువతకు 25లక్షల ఉద్యోగావకాశాల కల్పన, విదేశీ ఉద్యోగాల శిక్షణకు ఫారిన్ ఎంప్లాయిమెంట్ బోర్డు ఏర్పాటు, ప్రైవేటు ఆస్పత్రుల్లో రూ.5లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా, ఆస్తి పన్ను రద్దు, 400 యూనిట్ల లోపు గృహ విద్యుత్తు వినియోగంపై కరెంట్ బిల్లు సగానికి తగ్గింపు, అన్ని జిల్లా, సబ్ డివిజినల్ టౌన్లలో ఆమ్ఆద్మీ క్యాంటీన్లు నెలకొల్పి రూ.5కే భోజనం, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు అందించే పింఛన్లను రూ.500 నుంచి రూ.2500కి పెంపు, వీటితో పాటు రైతులకు రుణమాఫీ, ఆప్‌కు చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు బుగ్గ కార్లు వినియోగించకపోవడం వంటి చర్యలు చేపడతామని పంజాబ్ ఓటర్లకు హామీ ఇస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







