సిందూరపువ్వు పుట్టిన రోజు ఇవాళ
- January 29, 2017
గ్లామర్ హీరోయిన్ అంటే.. తీరైన ఒళ్లు.. తెల్లని రంగు.. నిలువెత్తు అందం.. అంటూ ఏవేవో ఊహించుకుంటారు.. కానీ అవేవీ పెద్దగా లేకుండానే గ్లామరస్ హీరోయిన్ గా మత్తైన చూపుల్తో గుచ్చేసిన హీరోయిన్ నిరోషా. ఒకప్పుడు తన వాలు కళ్లతో కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసిన బ్యూటీ ఆమెది. తమిళంతో మొదలుపెట్టి... తెలుగు, కన్నడ, మళయాల సీమల్లో సినిమాలను అభిమానులను సంపాదించుకున్న ఈ సిందూరపువ్వు పుట్టిన రోజు ఇవాళ.
రాధిక సిఫారసులు కూడా అవసరం లేకుండానే చాలా తక్కువ టైమ్ లోనే నిరోషాకు గుర్తింపు వచ్చింది. అందుకే తెలుగు నుంచీ ఆఫర్స్ మొదలయ్యాయి. తను తెలుగులో చేసిన మొదటి సినిమా నారీ నారీ నడుమ మురారీ. ఈ సినిమాలో బాలకృష్ణ మరదలిగా నిరోషా నటనకు హొయలకు ఆడియన్స్ ఫిదా అయిపోయారు. సినిమా కూడా సూపర్ హిట్ కావడంతో నిరోషా ఇక్కడా హాట్ ఫేవరెట్ అయిపోయింది.
సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. చాలా వరకూ మాయలే ఉంటాయి. అయితే నిరోషా ఆ మాయల్లో పడిపోలేదు. కెరీర్ ఆరంభంలోనే ఆమెకు సిందూరపూవు హీరో రాంకీతో ప్రేమదోమ కుట్టింది. ఆ ప్రేమ కథను కొనసాగిస్తూనే దక్షిణాదిలోని చాలా భాషల్లో నటిస్తూ వచ్చింది. అది కూడా గ్లామర్ తారగా రాణించింది. ఓ రకంగా ఇది అంత ఈజీగా సాధ్యమయ్యే విషయం కాదు. కానీ అండర్ స్టాండింగ్ తో అన్నీ దాటేసిందీ సోయగం.. ఏదేమైనా తెలుగులో డిటెక్టివ్ నారద సినిమా తర్వాత మళ్లీ కనిపించలేదు నిరోషా. అయినా చేసిన కొన్ని సినిమాలతోనే తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుందిక్కడ. అయితే ఇతర భాషల్లో మంచి అవకాశాలువస్తున్న టైమ్ లోనే పెళ్లి చేసుకుంది. దీంతో సడెన్ గా అవకాశాలు ఆగిపోయాయి. అప్పుడు కానీ తను చేసిన తప్పేంటో అర్థం కాలేదు.
తాజా వార్తలు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







