టూరిజం డ్రైవ్‌లో 'ఎట్ బహ్రెయిన్'
- January 30, 2017
బహ్రెయిన్ ముంతాలకత్ హోల్డింగ్ కంపెనీ 'ఎట్ బహ్రెయిన్' సైట్ సీయింగ్ బస్సుల్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. బహ్రెయినీ టూర్ గైడ్స్ ద్వారా ఈ బస్సుల్ని ఆపరేట్ చేస్తారు. లైసెన్స్ పొందిన టూర్ గైడ్స్, టూరిస్టులకు సంపూర్ణ సమాచారాన్ని అందిస్తారు. ఫిబ్రవరిలో బుకింగ్స్ ప్రారంభమవుతాయి. ఎట్ బహ్రెయిన్ సిఇఓ పీటర్ కాక్ మాట్లాడుతూ, బహ్రెయిన్ ఇకపై మరింతగా టూరిస్టులకు ఎట్రాక్షన్ అవుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఎయిర్ కండిషన్‌తో కూడిన, లగ్జరీ కోచ్ పర్యాటకులకు అద్భుమతైన అనుభూతిని మిగల్చనున్నాయి. వారంలో ఏడు రోజులూ ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. 'బహ్రెయిన్ ఇన్ ఎ డే', 'ఎక్స్‌ప్లోర్ ది సిటీ ఆఫ్ మనామా', 'ఫ్రై డే ఆఫ్టర్‌నూన్ ఎస్కేప్' వంటి ప్యాకేజీలతో పర్యాటకులను ఆకట్టుకోనున్నట్లు ఎట్ బహ్రెయిన్ వెల్లడించింది. బైలింగ్వల్ బహ్రెయినీ టూర్ గైడ్స్, అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ పొందారనీ, కింగ్‌డమ్‌కి సంబంధించి పూర్తి సమాచారం, అలాగే హిస్టరీ మరియు కల్చర్ పట్ల అవగాణ కలిగి ఉన్నవారని కుక్ వివరించారు. కింగ్‌డమ్‌కి చెందిన 4 స్టార్, 5 స్టార్ హోటల్స్ నుంచి ఈ టూర్స్ బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







