సౌదీ అరేబియా: తీవ్రవాద కేసుల్లో 5,094 మంది అరెస్ట్
- January 30, 2017
తీవ్రవాదంతో సంబంధమున్న కేసుల్లో 5,094 మంది అరెస్ట్ కాగా, ఇందులో సౌదీల సంఖ్య 4,254. యెమెనీల సంఖ్య 281 మంది. తీవ్రవాద కేసులతో అరెస్టయిన విదేశీయుల్లో యెమనీలదే ఎక్కువ వాటా. ఇంకో వైపున సోమవారం, అధికారులు నలుగురు వ్యక్తుల్ని విడుదల చేశారు. వీరి జైలు శిక్ష పూర్తి కావడంతో, వీరిని విడుదల చేయడం జరిగింది. విడుదలైనవారిలో ఓ యెమనీ, ఓ సిరియన్, ఓ ఇండియన్, ఓ టర్క్ ఉన్నారు. సోమవారం 13 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో సౌదీ అరేబియా, బహ్రెయిన్, సుడాన్ మరియు పాకిస్తాన్‌కి చెందినవారున్నారు. వెస్టర్న్ సౌదీ అరేబియాలో అరెస్టయిన పాకిస్తానీల సంఖ్య 68 నుంచి 76కి చేరుకుంది. ఈ వివరాలన్నీ ఇంటీరియర్ మినిస్ట్రీకి చెందిన ప్రిజనర్స్ సెంటర్ నఫెతాలో పేర్కొనబడ్డాయి. 217 మంది సిరియన్లు, 30 మంది సుడానీస్, 18 మంది ఇండియన్లు, 11 మంది బహ్రెయినీలు, ముగ్గురు టర్క్‌లు సౌదీ అథారిటీస్ అరెస్ట్ చేసినవారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







