గ్రీన్‌కార్డు ఉన్నవారికి మినహాయింపు...
- February 02, 2017
వాషింగ్టన్: వలసలు, శరణార్థులను అడ్డుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన నిషేధం నుంచి అమెరికాలో గ్రీన్‌కార్డు ఉన్నవారిని మినహాయించారు. ముస్లిం మెజారిటీ ఉన్న ఏడు దేశాల నుంచి మూణ్నెల్ల పాటు అమెరికాకు ఎవ్వరూ రాకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికాలో గ్రీన్ కార్డు ఉన్న ఆ ఏడు దేశాలకు చెందిన వారు అమెరికా నుంచి బయటకు వెళ్లడానికి, తిరిగి అమెరికాకు రావడానికి ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని.. వారికి మినహాయింపు ఇస్తున్నామని శ్వేతసౌధం అధికార ప్రతినిధి సీన్ స్పైసర్ తాజాగా ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్ విధించిన నిషేధం అంతర్జాతీయంగా తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
ఈ నిషేధంతో ఏడు దేశాలకు చెందిన వారికి గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ అమెరికాకు వెళ్లే విమానాల్లో , అమెరికా నుంచి వచ్చే విమానాల్లో ఎక్కకుండా అడ్డుకున్నారు. దీంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వైట్‌హౌస్ విడుదల చేసిన తాజా ప్రకటన ద్వారా గ్రీన్‌కార్డుదారులకు వూరట లభించనుంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







