ఎన్నికల జాతర తెలంగాణలో మరోసారి...
- February 02, 2017
హైదరాబాద్ : తెలంగాణలో మరోసారి ఎన్నికల జాతర మొదలుకానుంది. మే నెలాఖరు వరకు 7 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీంతో రాజకీయ పార్టీలు లెక్కలేసుకుంటున్నాయి. నేడో, రేపో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉండడంతో ఆశావహుల సందడి మొదలైంది. మూడు ఎమ్మెల్యే కోటాలోనూ, స్థానిక సంస్థల కోటాలో ఒకటి, టీచర్స్ కోటాలో మరో స్థానంతోపాటు గవర్నర్ కోటాలోని 2 స్థానాలు ఖాళీ కానున్నాయి. మార్చి 29న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్థన్ రెడ్డి, ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీలు గంగాధర్ గౌడ్. హైదర్ రజ్వీ, మాగం రంగారెడ్డిల పదవి కాలం ముగుస్తుంది. మే 27న నామినేటెడ్ ఎమ్మెల్సీలు రాజేశ్వరరావు, ఫరూఖ్ హుస్సేన్ స్థానాలు ఖాళీ కానున్నాయి. మొత్తం 7 ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది.
పెద్దల సభలో ప్రస్తుతం గులాబీ పార్టీదే పై చేయిగా ఉంది. రెండున్నరేళ్లలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కారెక్కించుకుంది. ప్రస్తుతం ఖాళీ అవుతున్న 7 స్థానల్లో ఐదుగురు ఇతర పార్టీల నుంచి గులాబీ గూటికి చేరినవారే.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







