బాబు కామెంట్ హెచ్ 1 బీ వీసాపై...

- February 03, 2017 , by Maagulf
బాబు కామెంట్ హెచ్ 1 బీ వీసాపై...

హెచ్ 1బీ వీసాలపై ట్రంప్ విధించిన ఆంక్షల వల్ల మన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారని, వారిలో అయోమయం ఏర్పడిందని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అందువల్ల మన ఉద్యోగాలను మనమే సృష్టించుకోవలసి ఉందని చెప్పారు. అమెరికాలోని ఎన్నారైలలో చాలామంది తెలుగువారు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రత్యేక హోదాలో పారిశ్రామిక రాయితీలు ఉండవని ఆయన పునరుద్ఘాటించారు. హోదాతో వచ్చే ప్రయోజనాలన్నీ ప్యాకేజీలోనే ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. హోదా పేరుతో రాజకీయాలు చేయరాదని పరోక్షంగా జనసేనానికి సూచించారు.
శుక్రవారం నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న ఆయన..కొడవలూరు మండలం రాచర్లపాడు వద్ద ఇఫ్కో కిసాన్ సెజ్ లో ఏర్పాటు చేసిన గమేసా గాలి మరల ప్యానల్స్ పరిశ్రమను లాంచ్ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com