రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'టచ్ చేసి చూడు'...
- February 03, 2017
హైదరాబాద్: మాస్ మహారాజా రవితేజ హీరోగా విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'టచ్ చేసి చూడు'. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. రవితేజపై చిత్రీకరించిన ముహూర్తపు దృశ్యానికి నిర్మాతల్లో ఒకరైన వల్లభనేని వంశీ మోహన్ క్లాప్ ఇవ్వగా, ఎడిటర్ గౌతంరాజు కెమెరా స్విచాన్ చేశారు. దర్శకుడు వి.వి. వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ మోహన్ మాట్లాడుతూ.. 'ఈ రోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నాం. వారం రోజులకుపైగా ఇక్కడే తొలి షెడ్యూల్ చేయనున్నాం.
తదుపరి షెడ్యూల్ పాండిచ్చేరిలో 25 రోజులు జరుగుతుంది. మాస్ మహారాజా రవితేజ ఇమేజ్‌కి తగ్గట్టుగా రచయిత వక్కంతం వంశీ మంచి కథను తయారు చేశారు' అని అన్నారు. రాశీఖన్నా, లావణ్య త్రిపాఠి ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!







