అధికారమంటే ఆధ్యాత్మిక శక్తి...
- February 04, 2017
అధికారమంటే ఆధ్యాత్మిక శక్తి
మనమంతా దుర్యోధనులం
'దైవీక కాదల్' పుస్తకావిష్కరణలో రజనీకాంత్
చెన్నై, ఫిబ్రవరి 4: సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారా.. లేదా? అన్నది మిలియన డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయిన తరుణంలో ఆయన తొలిసారి 'పవర్' గురించి స్పందించారు. 'పవర్' అంటే తనకూ ఇష్టమేనని... కానీ, అది అందరూ ఊహించే 'పవర్' కాకుండా ఆధ్యాత్మికతకు సంబంధించినదని వ్యాఖ్యానించారు. పరమహంస యోగానంద రచించిన 'ది డివైన్ రొమాన్స్' తమిళ అనువాదం 'దైవీక కాదల్' పుస్తకావిష్కరణ కార్యక్రమం శనివారం చెన్నైలో జరిగింది.
ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం రజనీకాంత్ మాట్లాడుతూ.. తాను ఒక నటుడిగా, సూపర్‌స్టార్‌గా చెప్పుకోవడం కంటే, ఆధ్యాత్మికవేత్తగా చెప్పుకోవడానికే గర్వపడతానని అన్నారు. 'డబ్బు, పేరు కావాలా.. ఆధ్యాత్మికత కావాలా?
అనడిగితే ఆధ్యాత్మికతనే కోరుకుంటాను.' అని చెప్పారు. ఆధ్యాత్మికత చాలా పవర్ఫుల్ అని, తాను పవర్‌ని ఇష్టపడతానని అన్నారు. పవర్ అంటే తప్పుగా అనుకోవద్దని, ఇది ఆధ్యాత్మికత పవర్ అని చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..
'పడయప్ప (నరసింహ) తరువాత సినిమాలు మానేయాలని నిర్ణయించుకున్నాను. 2008-09లో సచ్చిదానంద నాకు మంత్రోపదేశం చేశారు. సినిమాలు మానొద్దని, శక్తివంతమైన సినిమాల ద్వారా ఆధ్యాత్మిక విషయాల్ని ప్రజలకు చేరువచేయాలని సూచించారు. తరువాత బెంగళూరులోని ఇంట్లో చదువుతున్నప్పుడు పుస్తకంలో మహావతార్ బాబాజీ ఫోటోలో కాంతి కనిపించింది.
అది భ్రమో.. అనుభూతో తెలీదు. ఆతర్వాత 'బాబా' సినిమా స్ర్కిప్టు తట్టింది. సీను బై సీను దానంతట అదే వచ్చేసింది.
వెంటనే చెన్నై వచ్చి 'బాబా' సినిమా నిర్మించాలని నిర్ణయించా. కథ, స్ర్కీన్‌ప్లే నేనే రాశాను. వ్యాపార రీత్యా బాగా ఆడకపోవడంతో డబ్బులు తిరిగిచ్చాను. క్రియా యోగంతో నా జీవితమే మారిపోయింది.
సామాన్య ప్రజలకు ఆధ్యాత్మికతను చేరువ చేయాలని ఉద్దేశంతో చెప్పినదే ధ్యానం. మన ఇంటికి ఒక అతిథి వస్తున్నాడంటే ఇల్లంతా ఎంతో శుభ్రంగా ఉంచుతాం. అలాంటిది దేవుడు మన మనసులోకి రావాలంటే మనం ఇంకెంత శుద్ధంగా ఉండాలి? మనమందరం దుర్యోధనులమే.
దుర్యోధనుడి వలె మనకీ ఏది మంచో, ఏది చెడో తెలుసు. కానీ, పాటించం. అబద్ధం చెప్పకూడదని తెలిసి అబద్ధం చెబుతాం. మనం దుర్యోధనులం కాకుండా శ్రీకృష్ణ పరమాత్ముడికి తనను తాను అర్పించి పరిశుద్ధుడైన అర్జునుడిగా మారదాం' అని రజనీకాంత్ పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







