భారతీయులు, ముస్లింలు, యూదులకు భయోత్పాతం కలిగించే మరో పరిణామం అమెరికాలో...
- February 04, 2017
అమెరికాలో ఒక కుటుంబానికి హెచ్చరిక
హోస్టన్, ఫిబ్రవరి 4: భారతీయులు, ముస్లింలు, యూదులకు భయోత్పాతం కలిగించే మరో పరిణామం అమెరికాలో చోటు చేసుకుంది. హోస్టన్ శివారున ఫోర్ట్ బెండ్ జిల్లాలో శనివారం ఓ కుటుంబం లేచీలేవగానే ఇంటి తలుపుపై ఆగంతకులు పెద్ద అక్షరాలతో ఒక ఉత్తరం రాసి అంటించారు. ''ముస్లింలు, భారతీయులు, యూదులను గెంటేస్తాం. ఇక్కడి నుంచి పొండి'' అని పెద్ద పెద్ద అక్షరాలతో రాసి ఉండడంతో వారంతా వణికిపోయారు. ''డోనాల్డ్ ట్రంప్ ఈ శ్వేత రాజ్యానికి దేవుడిచ్చిన గొప్ప వరం. ముస్లింలు, భారతీయులు, యూదులను ఇక్కడి నుంచి గెంటేస్తాం'' అని రాసి ఉంది.
ఈ ప్రాంతంలో ఎక్కువగా దక్షిణాసియా ప్రజలు నివసిస్తారు. ఒక వారం వ్యవధిలోనే అమెరికాలో వలసవాదులను భయాందోళనలకు గురిచేస్తూ ఇలాంటి ఘటనలు జరగడం ఇది రెండోసారి. దీంతో శ్వేతజాతేతరుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!







