షేక్ చేస్తున్న చిరంజీవి రెమ్యూనరేషన్..
- February 05, 2017
'ఖైదీ నెంబర్ 150' కలక్షన్స్ హవా ముగియడంతో ఇప్పుడు మెగా అభిమానులకు బుల్లితెర పండుగ ప్రారంభం కాబోతోంది. మెగా అభిమానులు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిరంజీవి 'మీలో ఎవరు కోటీశ్వరుడు' 4వ సీజన్ కార్యక్రమ టెలికాస్టింగ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఈ షో టెలికాస్టింగ్ ను ఫిబ్రవరి 13, 2017 రాత్రి 9.30 గంటల నుంచి ప్రారంభించడానికి మాటివి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
దీనితో ఈ షో గురించి అంచనాలు పెరిగిపోవడమే కాకుండా ఈకార్యక్రమ తొలి షోకు టీఆర్పీ రేటింగ్స్ ఏ రేంజిలో వస్తాయో అంటూ చర్చలు జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవితో హోస్ట్ చేస్తున్న షో కాబట్టి గతంలో తెలుగు టెలివిజన్ చరిత్రలో ఎన్నడూ రాని విధంగా భారీగా టీఆర్పీ రేటింగ్స్ వస్తాయని అంచనాలు వేస్తున్నారు.
ఇప్పటికే ఈ షోకు సంబంధించిన కొన్ని ఎపిసోడ్స్ రికార్డింగ్ పూర్తి అయింది. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న చిరంజీవికి ప్రతి ఎపిసోడ్కు పదిలక్షల రూపాయలు రెమ్యూనరేషన్ గా ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దక్షిణ భారత బుల్లితెర రంగానికి సంబంధించి ఏ ఛానల్ కూడ ఈ స్థాయిలో పారితోషికం ఒక ప్రోగ్రాం ప్రజంటర్ కు ఇచ్చిన దాఖలాలు లేవు అని అంటున్నారు.
ఇప్పటికే 'ఖైదీ' సూపర్ సక్సస్ తో తారాస్థాయికి చేరుకున్న చిరంజీవి క్రేజ్ ఈ బుల్లితెర షోతో మరింత పెరిగి పోతుంది అని భావించడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పరిస్థుతులను బట్టి చూస్తూ ఉంటే సినిమాల పరంగా మాత్రమే కాకుండా బుల్లితెర పై కూడ మెగా స్టార్ ప్రభంజనం ఈ సంవత్సరం అంతా కొనసాగే ఆస్కారం ఉంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







