పేదల ఆకలి తీర్చేందుకు నడుంబిగించిన నాట్స్
- February 05, 2017
పేదల ఆకలి తీర్చేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ మరోసారి నడుంబిగించింది. నాట్స్ ఫుడ్ డ్రైవ్ పేరుతో పెద్ద ఎత్తున ఆహార పదార్థాలు సేకరించి పేదలకు పంచి పెట్టే ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. తాజాగా న్యూజెర్సీలో నిర్వహిస్తున్న ఈ డ్రైవ్, ఫుడ్ క్యాన్ లను సేకరించి పేదలకు పంచి పెట్టాయి. నాట్స్ ఇచ్చిన పిలుపును అందుకుని తెలుగు ప్రజలు చాలా మంది ఈ ఫుడ్ క్యాన్స్‌ను విరాళంగా ఇచ్చారు. నాట్స్ ప్రెసిడెంట్ మోహన కృష్ణ మన్నవతో పాటు, బోర్డు సభ్యులంతా ఈ ఫుడ్ డ్రైవ్ కోసం భారీగా ఫుడ్ క్యాన్స్ సేకరించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసినట్లు నాట్స్ మహిళా విభాగం ప్రకటించింది. ఈ రకమైన సేవా కార్యక్రమాలు, స్థానిక సంస్థల సహాయ సహకారాలతో పాటు దాతల సాయంతో ముందు ముందు మరెన్నో కార్యక్రమాలు చేస్తామని ప్రకటించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







