ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన విమాన ప్రయాణం చేసిన ఖతార్ ఎయిర్‌వేస్
- February 05, 2017
వెల్లింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన విమాన ప్రయాణం చేసిన ఖతార్ ఎయిర్‌వేస్ విమానం సోమవారం న్యూజిలాండ్ చేరుకుంది. ఖతార్‌లోని దోహా నుంచి బయలుదేరిన ఈ విమానం 14,535 కిలోమీటర్లు ప్రయాణించి న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చేరుకుని చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో 16 గంటల 23 నిమిషాలు నాన్‌స్టాప్‌గా ప్రయాణించింది. అనుకున్న సమయం కంటే అయిదు నిమిషాల ముందే ఆక్లాండ్‌కు చేరుకున్నట్లు ఖతార్ ఎయిర్‌వేస్ తెలిపింది.
లాంగ్ రేంజ్ బోయింగ్ 777-200ఎల్‌ఆర్ విమానం ఈ ప్రయాణ సమయంలో 10 టైమ్‌జోన్లు దాటింది. విమానంలో నలుగురు పైలట్లు, 15 మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారు.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో సిబ్బంది 1100 కప్పుల టీ, కాఫీ, 2వేల కూల్‌డ్రింక్స్, 1036 మీల్స్ సర్వ్ చేశారట. గత ఏడాది మార్చిలో ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ ప్రయాణం చేసే నాన్‌స్టాప్ కమర్షియల్ విమానంగా దుబాయి నుంచి ఆక్లాండ్‌కు సర్వీసు ప్రారంభించింది. వీటి మధ్య 14,200కిలోమీటర్ల దూరం. ఎయిరిండియా కూడా దిల్లీ నుంచి అమెరికాలో శాన్‌ఫ్రాన్సిస్‌కో వరకు నాన్‌స్టాప్ విమానం నడుపుతోంది. అయితే ఖతార్ ఎయిర్‌వేస్ దోహ-ఆక్లాండ్ సర్వీసుతో వీటిని అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘ విమాన ప్రయాణంగా రికార్డు సృష్టించింది.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







