రాత్రి పడుకునే ముందు పచ్చకర్పూరం గుళిక ఒకటి మింగితే...
- February 11, 2017
కర్పూరాల్లో రకాలున్నాయి. పచ్చకర్పూరం తెల్లకర్పూరంకన్నా చాలామంచిది. ఇది పలుకులుగా దుకాణంలో దొరుకుతుంది. దీన్ని రెండు పలుకులు తీసుకుని కొంచెం మంచి గంధాన్నిగానీ, వెన్ననుగానీ కలిపి తమలపాకులో పెట్టి నమిలిరసాన్ని మింగితే వెంటనే వేడి తగ్గుతుంది. కళ్ళుబైర్లు కమ్మడం, తలతిరుగుడు, కడుపులో వికారం, అతిగా శరీరానికి చమటలు పట్టడం తగ్గిపోతాయి.
బాగా పైత్యం చేసినవారు పచ్చ కర్పూరాన్ని తీసుకుంటుంటే పైత్య వికారాలన్నీ తగ్గిపోతాయి. కంటికి సంబంధించిన వ్యాధులతో బాధపడేవారు పచ్చకర్పూరాన్ని తీసుకుంటుంటే కళ్ళమంటలు, కళ్ళు ఎరుపెక్కడం, కళ్ళవెంటనీరు కారడం, తలనొప్పి వంటివి తగ్గుతాయి.
బి.పి వున్నవారు రెండుపూటలా పచ్చకర్పూరాన్ని తీసుకుంటే బి.పి పెరగకుండా అరికడుతుంది. మూత్రం పోసేటపుడు, మంట, చీము, సుఖవ్యాధులున్నవారు పచ్చకర్పూరాన్ని గంధంతో కలిపి తీసుకుంటుంటే బాధలన్నీ నివారిస్తాయి. వేడి చేయడం వలన కలిగే ఒళ్ళుమంటలు, అరికాళ్ళూ, అరిచేతుల మంటలు మొదలైన వాటికి పచ్చ కర్పూరాన్ని గ్లాసుడు పాలతో కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.
పచ్చకర్పూరం అయిదు గ్రాములు, జాజికాయ అయిదు గ్రాములు, జాపత్రి అయిదు గ్రాములు ఈ మూడింటిని మొత్తగానూరి, దాంట్లో అయిదు గ్రాములు ఎండుద్రాక్షవేసి మళ్ళీనూరి, దీన్ని శనగగింజలంత మాత్రలగా తయారుచేసి పెట్టుకుని రోజూ పడుకోబోయే ముందు ఒక మాత్ర వేసుకుని, పాలు తాగుతుంటే వీర్యం వృద్ధి చేందుతుంది. లైంగికశక్తి బాగా పెరుగుతుంది.
పచ్చకర్పూరాన్ని రోజూ మూడుపూటలా ఒకటి, రెండు పలుకులు తీసుకుంటుంటే, బలం, రక్తపుష్టి కలుగుతుంది. లైంగకశక్తి పెరుగుతుంది. బి.పి తగ్గుతుంది. కంటిజబ్బులు, రక్తస్రావాలు అరికడతాయి. ఏ మందు వాడుతున్నపుడైనా ఆమందుతోపాటు ఒక పలుకు పచ్చకర్పూరం కలిపి తీసుకుంటే ఔషధగుణం పెరుగుతుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







