ముగ్గురు బహ్రెయిన్ తీవ్రవాద అనుమానితులు సౌదీ అరేబియాలో పట్టివేత ...
- February 11, 2017
మనామా: తీవ్రవాదం కేసులకు సంబంధించి ముగ్గురు బహ్రెయిన్ అనుమానితులను సౌదీ భద్రతా అధికారులు అరెస్టు చేశారు ఈ విషయాన్ని సౌదీ మీడియా శనివారం నివేదించారు. గత నెలలో అరెస్ట్ కాబడిన 85 మంది బహ్రయినీయులలో అనుమానితుల జాబితాలో వీరు సైతం ఉండటంతో అదుపులోనికి తీసుకొన్నట్లు పేర్కొన్నారు. పట్టుబడిన ఈ తీవ్రవాద అనుమానితులకు సంబంధించిన ఎటువంటి వివరాలు వెల్లడి చేయకుండా ఒక నివేదిక విడుదల చేశారు. ఈ అనుమానితులలో అత్యధిక శాతం మంది సౌదీ జాతీయులు ఆ తర్వాత పాకిస్తానీ ,యెమెన్ మరియు సిరియన్ దేశాలకు చెందిన అనుమానితులు ఉన్నట్లు వివరించారు. అయితే, ఈ బహ్రయినీయులను వేర్వేరు తేదీల్లో అరెస్టు చేసినట్లు తెలిపారు విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుబడిన నిందితులలో ఓ అనుమానిత బహ్రేయినీ వ్యక్తి సౌదీ అరేబియాలో తీవ్రవాద కార్యకలాపాలలో చురుకైన పాత్ర పోషించినట్లు తెలుస్తుంది. మోస్ట్ వాంటెడ్ వ్యక్తుల జాబితాలో గతంలోనే ఆ వ్యక్తి పేరుని చేర్చినట్లు తెలుస్తుంది. ఈ వ్యక్తి ఆచూకీ చెబితే గత అక్టోబర్ 1 మిలియన్ (100,000 బి డి ) ఒక బహుమతి సైతం ప్రకటించారు. పట్టుబడిన మరుసటి రోజు అనుమానితుడు గురించి సమాచారాన్ని బహ్రెయిన్ బహిర్గతం చేసింది. ఆ అనుమానిత నిందితుడు నాలుగు సంవత్సరాల క్రితమే బహ్రెయిన్ నుంచి పారిపోయాడని బహ్రేయినీ అధికారులు స్పష్టీకరించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







