పన్నీర్-శశికళపై వర్మ సెటైర్..
- February 12, 2017
చెన్నై: తమిళ రాజకీయాల్లో నాటకీయత పాళ్లు సినిమాలను, సీరియళ్లను తలదన్నే రీతిలో సాగుతున్న తరుణంలో.. ఎప్పుడూ వివాదాలతోనే సహవాసం చేసే దర్శకుడు రాంగోపాల్ వర్మకు ట్విట్టర్ మోత మోగించడానికి మరో మసాలా అంశం దొరికినట్టయింది.
తాజాగా ట్విట్టర్ వేదికగా తమిళ ఆపద్దర్మ సీఎం పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ పైన రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో సెటైర్స్ వేశారు. తమిళ రాజకీయాలను చూస్తుంటే.. 'యూ టూ బ్రూటస్?' అనే పాత రోమన్ సామెత గుర్తుకు వస్తోందన్నారు.
'గతంలో పన్నీర్ సెల్వం బానిసలా ఉండేవారని, ఆ విషయాన్ని శశికళ ఇప్పుడు జ్ఞాపకం తెచ్చుకుంటున్నారని, కానీ ఆమె మరిచిపోతున్న విషయమేంటంటే..
గతంలో తాను కూడా ఓ బానిసనేనని' అంటూ వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మొత్తం మీద ఓ బానిస తిరగబడ్డాడని శశికళ భావిస్తుందే తప్ప గతంలో ఆమె కూడా ఒకలాంటి బానిసే అని వర్మ గుర్తుచేశారన్నమాట.
తాజా వార్తలు
- ఖతార్లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







