మాటీవి' మార్పులు: లోగో మారింది, ఉద్యోగస్తుల పరిస్దితి ఏంటి...
- February 12, 2017
హైదరాబాద్: మాటీవీ తెలుగు ఎంటర్టైన్మెంట్ చానెల్స్ రీసెంట్ గా స్టార్ టీవీ నెట్‌వర్క్‌లో భాగం అయ్యాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున యజమానులుగా ఉన్న మా టెలివిజన్ నెట్వర్క్ లిమిటెడ్‌కు చెందిన బ్రాడ్‌కాస్టింగ్ వ్యాపారాన్నీ, బ్రాండ్, అసెట్స్‌తో సహా స్టార్ టీవీ ఏకమొత్తంగా కొనుగోలు చేసింది. దాంతో మాటీవి లోగో మారింది.
స్టార్ తో కలిసి కొత్త బ్రాండ్ లోగోతో ఇక కనపడుతోంది. ఈ లోగోని చిరంజీవి హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. అనంతరం తాను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' కార్యక్రమానికి సంబంధించిన విషయాలను చిరంజీవి మీడియాతో పంచుకున్నారు.
మా టెలివిజన్ నెట్‌వర్క్‌కు చెందిన నాలుగు చానళ్లు.... మాటీవీ, మా మ్యూజిక్, మా మూవీస్, మా గోల్ట్‌ను స్టార్ టీవీ గ్రూప్ సొంతం చేసుకుంటుంది. మా టెలివిజన్ నెట్వర్క్ లిమిటెడ్ కంపెనీ మాత్రం ప్రమోటర్ల చేతుల్లోనే ఉంటుంది.
మా టెలివిజన్ నెట్‌వర్క్‌లో నిమ్మగడ్డ ప్రసాద్‌కు 65 శాతం వాటా ఉండగా చిరంజీవి కుటుంబానికి 20 శాతం, అక్కినేని నాగార్జునకు 10 శాతం, రిటైల్ ఇన్వెస్టర్ల చేతుల్లో 5 శాతం వాటాలు ఉన్నాయి. కంపెనీ తన వ్యాపారాన్ని విక్రయిస్తున్నందున ఈ డీల్‌కు సంబంధించిన మొత్తం సొమ్ము మా టీవీ నెట్వర్క్ కంపెనీ ఖాతాల్లోకి వెళుతుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







